IPL 2024 : రికార్డు సృష్టించిన ఎమ్మెస్ ధోని

-

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. 42 ఏళ్ల వయస్సులోనూ రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తున్నా ధోని,ఫీల్డింగ్‌లో తన విన్యాసాలతో అలరిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని.. ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 150 క్యాచ్‌లు అందుకున్న ఏకైక ఆటగాడిగా ధోని సొంతం చేసుకున్నాడు. సిమర్‌జీత్ సింగ్ వేసిన రైజింగ్ డెలివరీని జితేష్ శర్మ నేరుగా కీపర్ చేతుల్లోకి కొట్టడంతో ధోనీ ఈ ఘనత అందుకున్నాడు. ఐపీఎల్‌లో వికెట్ కీపర్‌గా 146 క్యాచ్‌లు, ఫీల్డర్‌గా నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న క్రికెటర్లు

150 క్యాచ్‌లు: ఎంఎస్ ధోని

144 క్యాచ్‌లు: దినేష్ కార్తీక్

118 క్యాచ్‌లు: ఏబీ డివిలియర్స్

113 క్యాచ్‌లు: విరాట్ కోహ్లీ

109 క్యాచ్‌లు: సురేష్ రైనా

Read more RELATED
Recommended to you

Latest news