బ్రేకింగ్ : కరోనా ఎఫెక్ట్ తో మాజీ సీఎం కన్నుమూత

Join Our COmmunity

పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధ పడుతూ గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (జిఎంసిహెచ్) లో చికిత్స పొందుతున్న అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిస్వా శర్మ ధృవీకరించారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న అయన వయసు 84.  ఆయన సాయంత్రం 5.34 గంటలకు ఈ ప్రపంచాన్ని విడిచి పెట్టారు,” అని శర్మ గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వెలుపల ప్రకటించారు. ఇప్పటి వరకు అనుకున్నట్లుగా, మృతదేహాన్ని గువహతిలో సాంస్కృతిక సంస్థ శ్రీమంత శంకర్ దేవ కల ఖేత్ర వద్ద మంగళవారం ఉంచారు.

ఇక ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ గోగోయ్ కుటుంబంతో ఉండటానికి తన షెడ్యూల్ చేసిన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసి డిబృగర్ నుండి గౌహతికి తిరిగి వెళ్లారు. “అతను ఎల్లప్పుడూ నాకు తండ్రి లాంటి వ్యక్తి. ఆయన కోలుకోవాలని లక్షలాది మంది ప్రర్దించారు. అయినా అయన మనకు దక్కలేదు అని అని సోనోవాల్ ట్వీట్ చేశారు. ఆగస్టు చివర్లో గోగోయికి కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది మరియు అతని పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు ప్లాస్మా థెరపీ అందించారు. కోవిడ్ నెగటివ్ వచ్చాక గోగోయి పోస్ట్ కోవిడ్ సమస్యలతో పోరాడుతున్నాడు. ఆయన నవంబర్ 2 నుండి నాన్-ఇన్వాసివ్ వెంటిలేషన్ లో ఉన్నాడు, కానీ శనివారం ఆయన్ని ఇన్వాసివ్ వెంటిలేషన్ కింద ఉంచారు.

 

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news