రాజధాని కేస్ లపై హైకోర్ట్ త్రిసభ్య ధర్మాసనం ముందు నేడు విచారణ జరిగింది. రైతుల తరపున హైకోర్ట్ సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు రోజంతా తన వాదనలు వినిపించారు. రాజధానిలో నిర్మాణాల ఖర్చులపై అకౌంటెంట్ జనరల్ నివేదిక సమర్పించకపోవడంపై ధర్మాసనం సీరియస్ అవ్వడమే కాకుండా… ఇంతవరకు నివేదిక ఎందుకు సమర్పించలేదని నిలదీస్తూ… వచ్చే సోమవారంలోపు నివేదిక సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది.
నివేదిక సమర్పించకపోతే ఎకౌంటెంట్ జనరల్ కోర్టుకు రావాల్సి ఉంటుందని హెచ్చరికల జారీ చేసింది. జీఎన్ రావు కమిటీ, బూస్టన్ కమిటీ, హైపవర్ కమిటీ నివేదికల్లో సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని ఎక్కడుందని ప్రశ్నించిన హైకోర్ట్… కొత్త చట్టం చేయాలని కూడా నివేదికలో లేదని చెప్పింది. ఆ నివేదికల ప్రకారమే మూడు రాజధానులు చేశామని ప్రభుత్వం చెబుతుందని అడ్వొకేట్ ఉన్నం మురళీధరరావు చెప్పగా… నివేదికల్లో ఎక్కడుందని ధర్మాసనం ఎదురు ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు 37, 38 ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు చేశామని ప్రభుత్వం చెప్పింది. ఈ వాదనలను హైకోర్ట్ అంగీకరించింది.