అర్జెంట్ గా తెలంగాణలో బలమైన పార్టీగా ముద్ర వేయించుకునేందుకు బిజెపి ఎన్నో వ్యయప్రయాసలు పడుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు ఉత్సాహాన్ని, పార్టీ నాయకుల్లో చెదిరిపోకుండా చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలు వాడివేడిగా జరుగుతుండడం, టిఆర్ఎస్ ,బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉండడం, ఈ రేసులో కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రంగా ఉండడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటు చేసుకుంటూ ఉండడం బిజెపికి ఉత్సాహం తీసుకువస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులు చాలామందిని బిజెపి లో చేర్చుకుని, బిజెపి ఉత్సాహంగా గ్రేటర్ పోరులో ముందుకు వెళ్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే విజయశాంతి కాంగ్రెస్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయం అయిన నేపథ్యంలో, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకుని, టిఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలని, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత బలహీనం చేసి, ఆ పార్టీకి తెలంగాణలో అధికారం తీసుకురావాలి అని చూస్తోంది. ఇదంతా సాధ్యం అవ్వాలంటే ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ బిజెపిలో చేరాలని, ఆయన అయితేనే టిఆర్ఎస్ ను కేసీఆర్, కేటీఆర్ ను సమర్థవంతంగా అడ్డుకుని బీజేపీని అధికారంలోకి తీసుకు వెళ్ళగలము అనే నమ్మకాన్ని బిజెపి అగ్రనాయకులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే రేవంత్ కోసం బిజెపి అగ్రనాయకులు రకరకాల మార్గాల్లో ఆయనతో మంతనాలు చేస్తూ, రకరకాల ఆఫర్లు ఆయనకు ఇస్తూ, పార్టీలో సముచిత స్థానం కల్పించడంతోపాటు, రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత కీలక పదవిని ఇస్తామని హామీ ని సైతం ఇస్తూ, ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ సైతం కాంగ్రెస్ లో ఉంటే తన రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది అనే విషయాన్ని గుర్తించారు. అందుకే బిజెపిలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నా, మరికొంత కాలం వేచి చూస్తే బెటర్ అన్న అభిప్రాయంలో బీజేపీ లో చేరిక కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు అనే విషయాన్ని రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. బిజెపి అగ్ర నాయకులు మాత్రం ఏదో రకంగా రేవంత్ ను బిజెపి లోకి తీసుకువచ్చి య క్టివ్ చేయాలని చూస్తోంది.
-Surya