మహారాష్ట్ర మాజీ సీఎం కి కరోనా.. అసలు కారణం అదేనా..?

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు రికార్డు స్థాయిలో శరవేగంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. సామాన్యులు సెలబ్రిటీలు ప్రజాప్రతినిధులు అధికారులు అనే తేడా లేకుండ పంజా విసురుతుంది ఈ మహమ్మారి వైరస్. ఇటీవలే మరో ప్రజా ప్రతినిధి కరోనా వైరస్ బారిన పడ్డారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవలే కరోనా వైరస్ పరీక్షలు చేసుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తాజాగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు దేవేంద్ర ఫడ్నవీస్.

లాక్ డౌన్ అప్పటి నుంచి తాను విశ్రాంతి లేకుండా పని చేస్తున్నానని అందుకే దేవుడు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని ఇలా కరోనా వైరస్ సోకేలా చేసినట్లు చెప్పుకొచ్చాడు దేవేంద్ర ఫడ్నవీస్. ప్రస్తుతం బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఇన్చార్జిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ కు ప్రచార సమయంలోనే కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఇక బీహార్ ఎన్నికల ప్రచార ఇన్చార్జిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ కీ కరోనా పాజిటివ్ రావడంతో మిగతా నేతలందరూ కూడా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.