ఏడుగురు టీడీపీ కీలక నేతలకు ప్రాణ హాని.. వెలుగులోకి మెసేజ్ లు !

ఏపీలో ఏడుగురు టీడీపీ కీలక నేతలకు ప్రాణ హాని ఉందని అంటూ వచ్చిన మెసేజ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి తాజాగా ఓ బెదిరింపు మెస్సేజ్ వచ్చింది. అయ్యన్న పాత్రుడి ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేస్తున్నట్లు బుచ్చయ్య పేటకు చెందిన తాతారావు అనే వ్యక్తి మెస్సేజ్ పంపించాడు.

 

అయ్యన్నపాత్రుడే కాక ఆయనతో పాటు మరో ఆరుగురు కీలక నేతలకు ప్రాణహాని ఉందని సదరు మెసేజ్ లో అయన హెచ్చరించాడు. అంతే కాదు అందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని అయ్యన్న పాత్రుడిని మెసేజ్ లో కోరాడు. దీంతో వెంటనే జాగ్రత్త పడిన అయ్యన్న పాత్రుడు డీజీపీకి ఫిర్యాదు చేశారు. వెంటనే అలర్టయిన పోలీసులు మెస్సేజ్ పంపిన తాతారావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. అసలు ఎందుకు అలా మెసేజ్ చేశాడు అనే విషయం మీద కూపీ లాగే పనిలో పడ్డారు పోలీసులు.