తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం: రేపు “చలో రజోలిబండ”కు కాంగ్రెస్ పిలుపు

-

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ముదురుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్, వైసీపీల మధ్య మాట ఈ మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ వివాదంలో కి కాంగ్రెస్ కూడా ఎంటర్ అయింది. ఇందులో భాగంగానే ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.. ఏపీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రుల పై ఫైర్ అయ్యారు. నీళ్లు నిధులు, నియామకాల పేరిట ప్రజలను మభ్యపెట్టి.. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని ఫైర్ అయ్యారు.రాష్ట్రంలో అసమర్థత మంత్రులు ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జల దీక్ష చేసామని… నీటి దోపిడీ చేస్తున్న… విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి చెప్పిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తుందని నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1000 మందితో కలిసి రేపు చలో రాజోలిబండకు పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా కలిసి రేపు రాజోలిబండ కు తరలి రావాలని సంపత్ కుమార్ పిలుపు ఇచ్చారు.అలంపూరు ప్రధాన నియోజకవర్గ పరిధిలో ప్రధాన సమస్య అయిన ఆర్డియెస్ ను పట్టించు కొక పొగా.. తుమ్మిళ ఎత్తిపోతల పథకమును కూడా మధ్యలోనే ఆపేసి.. చేసిన బిల్లులు కాంట్రాక్టర్కు చెల్లించకుండా తుమ్మల ప్రాజెక్ట్ ను నిర్వీర్యం చేస్తున్నారని సాయి అయ్యారు. Rds కుడి కాలువ ద్వారా 4tmc ల నీరు, 160km మేర… ఏపీ ప్రభుతం 3నెలల క్రితం పనులు ప్రారంభించిందన్నారు. ఉమ్మడి పాలమూరుకు ఇద్దరు మంత్రులు ఉన్నా ఆర్డియెస్ ను పట్టించు కోవడంలేదని విరుచుకు పడ్డారు సంపత్.

Read more RELATED
Recommended to you

Latest news