హార్దిక్ పాండ్యపై సంచలన ఆరోపణలు చేసిన మాజీ క్రికెటర్

-

ఇప్పటివరకు 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2024 లో తొలి మూడు మ్యాచ్ల్లో పరాజయాన్ని మూటగట్టుకున్నపటికి ఆ తర్వాత ఆడిన రెండు మ్యాచ్ల్లో గెలిచి సక్సెస్ ట్రాక్ అందుకుంది. ఈ తరుణంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య గాయపడ్డారేమోనని ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సైమన్ డౌల్ అనుమానం వ్యక్తం చేశారు. గాయపడిన విషయాన్ని పాండ్య అంగీకరించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ ఐపీఎల్ సీజన్ తొలి రెండు మ్యాచుల్లో తొలి ఓవర్లలోనే బౌలింగ్కి వచ్చిన అతను, ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లో ఒక్క ఓవర్ మాత్రమే వేశారని గుర్తుచేశారు. కచ్చితంగా అతనికి ఏదో జరిగిందని, అందుకే బౌలింగ్ వేయట్లేదని అభిప్రాయపడ్డారు.

కాగా ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 48 బంతులు వేసి 89 పరుగులిచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. తొలి రెండు మ్యాచ్‌లలో హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. కానీ రాజస్థాన్ రాయల్స్‌ ,ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌ల్లో పాండ్యా ఒక్క ఓవర్ కూడా వేయలేదు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 1 ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. అంటే తొలి రెండు మ్యాచ్ ల్లో పూర్తి స్థాయి ఆల్ రౌండర్ గా కనిపించిన హార్డిక్ పాండ్యా ఆ తర్వాత బౌలింగ్ చేయకపోవడం కొత్త సందేహాలకు దారితీసింది.

Read more RELATED
Recommended to you

Latest news