రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మైనారిటీ మంత్రి కూడా లేడని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలను ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు.
ఎక్కడ చూసినా హత్యలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పకడ్బందీగా లా అండ్ అర్డర్ పని చేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో మైనారిటీలకు రూ.4 వేల కోట్లను కేటాయించాలని మహమూద్ అలీ డిమాండ్ చేశారు. పాతబస్తీలో కరెంట్ బిల్లుల వసూళ్లను అదానీ సంస్థకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదని అన్నారు. ముఖ్యంగా పాతబస్తీలో శాంతిభద్రతలు గాడి తప్పాయంటూ ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి బీ టీంగా పని చేస్తుందని మహమూద్ అలీ విమర్శించారు.