బ్రేకింగ్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్‌ కోచ్ గా సంజయ్ బంగర్ !

-

భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ బంగర్‌ గురించి… తెలియని వారుండరు. అంతర్జాతీయ క్రికెట్‌ లో టీమిండియా చాలా ఎన్నో సేవలు అందించారు సంజయ్‌ బంగర్‌. అయితే.. తాజాగా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ బంగర్‌ కు అరుదైన పదవి దక్కింది. ఐపీఎల్‌ జట్టు అయిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు మాజీ క్రికెటర్‌ సంజయ్‌ బంగర్‌ ను కోచ్‌ గా నియామకం అయ్యారు.

రాయల్‌ ఛాలెం జర్స్‌ బెంగళూరు జట్టుకు… ఐపీఎ ల్‌ 2022 సీజన్‌ నుంచి సంజయ్‌ బంగర్‌ హెడ్‌ కోచ్‌ గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు. కాగా.. సంజయ్‌ బంగర్‌ 15 వన్డేలలో టీమిండియాకు ప్రాతినిద్యం వహించాడు. అలాగే… 2003 ఏడాదిలో ప్రపంచ కప్‌ లో కూడా టీమిండియాకు సంజయ్‌ బంగర్‌ ప్రాతి నిధ్యం వహించాడు. ఇది ఇలా ఉండగా.. వచ్చే సీజన్‌ నుంచి బెంగళూరు కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లీ తప్పుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news