మీ తాటాకు చప్పుళ్లకు మేం బెదరం- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రతిగా కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి ఫైరయ్యారు. నిన్న చేసిన కేసీఆర్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ’ మీ తాటాకు చప్పుళ్లకు మేం బెదరం‘ అంటూ హెచ్చిరించారు. కేసీఆర్ భయపెట్టే ధోరణిలో మాట్లాడుతున్నారని.. నాలుకలు కోస్తాం అన్నారని.. గొంతు పెద్దదిగా చేస్తూ విమర్శలు చేస్తే కేంద్రంగానీ, బీజేపీ కార్యకర్తలు కానీ భయపడరని అన్నారు.  కేంద్రం తెలంగాణ నుంచి గత ధాన్యం సేరిస్తుందని, ప్రతీ సంవత్సరం కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల కోసమ కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా కొనుగోలు చేస్తుందన్నారు.

2014లో తెలంగాణ నుంచి  43లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం సేకరిస్తే..2021లో రూ. 26 వేల కోట్లతో 94 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం రవాణా, కూలీలు, సంచులు, నిల్వ చేసేందుకు ప్రతీ దానికి డబ్బుల ఇస్తుందని వివరించారు. వరి రైతుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్పుడు ప్రచారం చేశారన్నారు. కేంద్రం కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనుగోలు చేయనని చెప్పిందని… రా రైస్ గా ఇవ్వాలని కేంద్రం తెలంగాణను కోరిందని తెలిపారు.