రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసిన వేళ అధికార వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కాసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
ఈ మేరకు డొక్కాకు పసుపు కండువా కప్పి బాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు. కాగా, ఉదయం ఆయన వైఎస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి,రాజీనామా లేఖను ముఖ్యమంత్రి జగన్‌కు పంపించారు. వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న డొక్కా..కొన్నాళ్ల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన డొక్కా తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ పదవి హామీతోనే టీడీపీలో చేరారని గుంటూరు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.