చోటే భాయ్‌ రేవంత్ కి ఓటు వేసిన నరేంద్ర మోడీకి ఓటు వేసిన ఒక్కటే : కేసిఆర్

-

ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చోటే భాయ్.. నరేంద్ర భాయ్ బడే భాయ్ అని కేసిఆర్ అన్నారు.చోటే భాయ్‌కి ఓటు వేసిన నరేంద్ర మోడీకి ఓటు వేసిన ఒక్కటే.. ఎవరికి ఓటు వేసిన మోటార్లకు మీటర్లు పెడుతారు అని కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహబూబ్ నగర్ రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్ర వాళ్లు ఇక్కడ నుండి కాలువ పెట్టి మన నీళ్లు తీసుకుపోతుంటే.. రఘువీరా రెడ్డి పాదయాత్ర చేసుకుంటూ వస్తే ఇదే డీకే అరుణ నీళ్లు తీసుకుపొండి అని మంగళ హారతులు పట్టింది. ఈమెకు మనం ఓటు వేయాలా అని ధ్వజమెత్తారు.

తేలంగాణకు ఒక్క నవోదయ స్కూల్, మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మండిపడ్డారు.పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వని ప్రధాని మోదీ విశ్వగురువా అని కేసిఆర్ ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణకు అక్కరకు రాని చుట్టము అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news