కాళేశ్వరం నివేదికపై హైకోర్టుకు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని పిటిషన్ దాఖలు చేశారు హరీష్ రావు. అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక తయారు చేశారని ఇప్పటికే బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది.

అటు యూరియా అడిగినందుకు రైతు చెంప చెల్లుమనిపించడమేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన? అని హరీష్ రావు మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా రేవంత్ రెడ్డి ? అని ఆగ్రహించారు. ఈ ముఖ్యమంత్రికి తెలిసిన విద్యలు రెండే.. మూటలు మోయడం.. మాటలు మార్చడం… అని విమర్శలు చేశారు. యూరియా విషయంలో మొదటి నుంచి ఇప్పటిదాకా ఏం చెప్పారు. రాష్ట్రంలో యూరియా కొరతే లేదన్నారన్నారు.