అల్లు అర్జున్ ఇంటిలో విషాదం నెలకొంది. నిర్మాత అల్లు అరవింద్ కు మాతృవియోగం కలిగింది. అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నాన్నమ్మ కనకరత్న (94) మృతి చెందారు. వయోభారంతో అర్థరాత్రి 1.45 గంటలకు కన్నుమూశారు.

దింతో అల్లు అరవింద్ నివాసానికి చిరంజీవి చేరుకున్నారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ ను ఓదార్చారు చిరంజీవి. అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్… అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నాన్నమ్మ కనకరత్న నివాళులు అర్పించారు. అల్లు అరవింద్ మాతృమూర్తి కనకరత్నమ్మ మృతి పట్ల ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. కనకరత్నమ్మ మరణ వార్త బాధించిందన్న చంద్రబాబు, లోకేష్… ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.
Visuals of #Chiranjeevi and #AlluArjun seen together at the Allu residence.#AlluKanakaratnamma pic.twitter.com/JQE27DL5VJ
— Gulte (@GulteOfficial) August 30, 2025