మా ప్రధానికి డ్రగ్స్ కి పిచ్చి, మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు…!

-

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ కు మరో షాక్ తగిలింది. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ సర్ఫరాజ్ నవాజ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 1987 లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాదక ద్రవ్యాలను సేవించాడని ఆరోపించారు. 1987 లో ఇమ్రాన్ మాదకద్రవ్యాలను తీసుకోవడం తాను చూశానని నవాజ్ పేర్కొన్నాడు. ఖాన్ కొకైన్ తీసుకోవడం కూడా తాను చూశానని నవాజ్ తెలిపారు. ఇప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి వీడియో ఒకటి వైరల్ అయింది.

అంతే కాదు… తాను చెప్పింది అబద్దం అయితే ఇమ్రాన్ ఖాన్ కోర్ట్ కి కూడా వెళ్ళవచ్చు అని అతను పేర్కొన్నాడు. పాకిస్తాన్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇమ్రాన్ బాగా ఆడినప్పుడు ఇస్లామాబాద్‌ లోని ఇంటికి వచ్చి డ్రగ్స్ తీసుకున్నానని చెప్పాడు. నవాజ్ మరియు ఇమ్రాన్ ఇద్దరూ కలిసి పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడిన సంగతి తెలిసిందే. టాప్ బౌలర్స్ గా ఒక వెలుగు వెలిగారు.

Read more RELATED
Recommended to you

Latest news