వేసవికాలంలో ఆరోగ్యాన్ని దెబ్బ తీసే సమస్యలు ఇవే..!

-

వేసవికాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వలన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వాతావరణంలో మార్పులు జరగడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చాలా శాతం మంది డిహైడ్రేషన్ కు గురి అవుతారు. అంతేకాకుండా వేసవిలో చెమటలు ఎక్కువగా ఉంటాయి. కనుక చెమట రూపంలో కూడా డిహైడ్రేషన్ జరుగుతుంది, శరీరం నుండి నీరు మరియు లవణాలు బయటికి తొలగిపోతాయి. కనుక ప్రతిరోజు తప్పకుండా రెండు నుండి మూడు లీటర్ల వరకు మంచి నీరును తీసుకోవాలి. ఇలా చేయడం వలన హైడ్రేటెడ్ గా ఉండవచ్చు.

వీటితోపాటుగా ఆల్కహాల్ మరియు కెఫెన్ వంటి వాటికి వాటిని తీసుకోకపోవడం మేలు. దీంతో ఎంతో హైడ్రేటెడ్ గా ఉండవచ్చు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వలన చర్మం పై ఎంతో ప్రభావం ఉంటుంది. కనుక వేసవికాలంలో చర్మవ్యాధులు, దురద, దద్దుర్లు వంటి మొదలైన సమస్యలు తలెత్తుతాయి. కనుక సరైన దుస్తులను ఎంపిక చేసుకోవాలి మరియు చర్మ సమస్యలను ఎదుర్కొంటే తప్పకుండా డాక్టర్ల ను సంప్రదించాలి. అదేవిధంగా కచ్చితంగా యూవీ కిరణాల నుండి కాపాడుకోవడానికి సన్ స్క్రీమ్ ను ఉపయోగించాలి. ఇలా చేయడం వలన చర్మం కాంతిని కోల్పోకుండా ఉంటుంది మరియు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన సన్ బర్న్ కు గురవ్వాల్సి వస్తుంది.

అంతేకాకుండా అధిక ఉష్ణోగ్రతలు వలన కళ్ళకు సంబందించిన సమస్యలు కూడా ఎదురవుతాయి. తరచుగా నీటితో కళ్ళను కడగడం వలన కంటి వాపు, ఎలర్జీలు వంటి వాటి నుండి దూరంగా ఉండవచ్చు. సహజంగా వేసవికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలలో ఫుడ్ పాయిజనింగ్ కూడా ఒకటి. ఆహారాన్ని తయారు చేసిన తర్వాత ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన వేడిలో ఉంచాల్సి వస్తుంది. దీంతో బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. ఈ విధంగా ఫుడ్ పాయిజనింగ్ కు గురవ్వాల్సి వస్తుంది. కనుక ఎప్పుడు తాజాగా ఉండేటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news