కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు జస్వంత్ సింగ్ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. ఆయన 82 సంవత్సరాల వయసులో స్వర్గస్తులు అయ్యారు. మాజీ రక్షణ మంత్రి మరణాన్ని ట్విట్టర్ లో ప్రకటించిన ప్రస్తుత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ జస్వంత్ సింగ్ ను “విశిష్ట మంత్రి మరియు పార్లమెంటు సభ్యుడు” అని పేర్కొన్నారు. బిజెపి నాయకుడు & మాజీ మంత్రి శ్రీ జస్వంత్ సింగ్ జీ కన్నుమూసినందుకు చాల బాధగా ఉంది. ఆయన దేశానికి రక్షణ మంత్రిగానే కాక ఇంకా చాలా రకాలుగా తన సేవలు అందించారు అని రాజ్ నాద్ సింగ్ పేర్కొన్నారు.
ఆయన దేశానికీ అందించిన సేవలకి చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్న ఆయన రాజస్థాన్లో బిజెపిని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. ఈ విషయం మీద మోడీ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. జస్వంత్ సింగ్ జీ మన దేశానికి మొదట సైనికుడిగా, తరువాత రాజకీయ నాయకుడిగా తన సేవలు అందించారు. అటల్ జీ ప్రభుత్వ సమయంలో, ఆయన కీలకమైన బాద్యతలు నిర్వహించాడు. ఆర్థిక, రక్షణ మరియు విదేశీ వ్యవహారాల శాఖలో ఆయన బలమైన ముద్ర వేశాడని మోడీ పేర్కొన్నారు.