అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చేవారం భారీ ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న వేళ అభిమానుల మధ్య ప్రసంగించిన ట్రంప్.. ” నవంబర్ 15న ఫ్లోరిడా ఫామ్ బీచ్ లోని మార్ – ఏ లోగోలో పెద్ద ప్రకటన చేయబోతున్నా” అని ప్రకటించారు. అయితే ఆయన మళ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమని నెల రోజుల క్రితమే సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన ఏ ప్రకటన చేయబోతున్నారనే విషయంలో అమెరికా వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే 2020లో అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రటిక్స్ తనని మోసం చేసి గెలిచిందని ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇక 2024 లో జరిగే అధ్యక్ష ఎన్నికలలో తాను పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని గత నెల రోజుల క్రితమే ఆయన స్పష్టం చేశారు.