ఏపీ హైకోర్టులో వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కి ఎదురు దెబ్బ తగిలింది. మరియమ్మ హత్య కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మరియమ్మ హత్య కేసులో బెయిల్ ఇవ్వాలని నందిగం సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు. దీంతో ఏపీ హైకోర్టులో వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కి ఎదురు దెబ్బ తగిలింది.
ఇక అటు ఇటీవలే వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ పై మీద మరో కేసు నమోదు అయింది. అమరావతి ఉద్యమ సమయంలో ఇప్పటి బీజేపీ మంత్రి సత్య కుమార్ పై దాడికి పాల్పడ్డాడట వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు. వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు బేతపూడి రాజేంద్ర కత్తితో దాడికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ఈ తరునంలోనే… వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ పై మీద మరో కేసు నమోదు అయింది.