కష్టపడి చేసే దాంట్లో చీప్ గా ఉండదని ఎంత చిన్న పని అయినా సరే నమ్మకంతో కష్టపడితే తృప్తి ఉంటుంది అని ఈమె రుజువు చేశారు. MA ఇంగ్లీష్ పూర్తి చేసి టీచర్ గా పని చేయాలని అనుకున్నారు ఈమె. కానీ కాలం కలిసి రాకపోవడంతో ఈమె టీచర్ అవ్వలేకపోయారు. అలా అని నిరాశ పడలేదు.
ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యోగం రాకపోయే సరికి ఆమె ఒక టీ స్టాల్ పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. హాబీరా స్టేషన్లో ఈమె ఒక టీ కొట్టుని కూడా మొదలుపెట్టారు ఆ టీ కొట్టు కి ”మా ఇంగ్లీష్ చాయ్ వాలి” అని పేరు కూడా పెట్టారు.
View this post on Instagram
మొదట్లో ఈమె టీ కొట్టు పెడతాను అంటే తల్లిదండ్రులిద్దరూ కూడా బాధ పడ్డారు. కానీ టుక్ టుకీ మాత్రం ఆమె నిర్ణయంపైనే నిల్చుంది. అలా ఆమె మొత్తానికి ఒక చిన్న టీ కొట్టుని మొదలు పెట్టారు టీ మరియు స్నాక్స్ ని అక్కడ అమ్ముతున్నారు.
అక్కడ టీ తాగిన వాళ్ళు స్టాల్ పేరు చూసి చాలా బాగా ఆకర్షితులయ్యారని.. ఆమె కథను చూస్తే ఎంతో ఆదర్శంగా ఉందని చెప్పారు. ఏదీ కూడా అసాధ్యం కాదు అని ఈమె నిరూపించారు. ఎంతో మంది ఆడవాళ్ళకి ఈమె ఆదర్శంగా నిలిచారు ఎప్పుడూ కూడా మనం వెళ్లి దారి మనకి సహకరించకపోతే కుంగిపోకూడదు. మరో దారి వెతుక్కుంటూ దానిలో విజయం పొందడానికి చూసుకోవాలి.