దారుణం; బాలుడిపై నలుగురు యువకుల అత్యాచారం…!

-

దేశంలో అత్యాచారాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక పక్క రేపిస్ట్ లను కాల్చి చంపుతున్నా వాళ్ళను ఉరి వేస్తున్నా కఠిన చట్టాలు తీసుకోస్తున్నా సరే ఎవరూ ఆగడం లేదు. చిన్న పిల్లలు వృద్దులు అనే తేడా లేకుండా రేప్ లు చేస్తున్నారు. దేశం మొత్తం దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. ఎన్ని విధాలుగా అత్యాచారాలపై చర్యలు తీసుకున్నా సరే నేరాలు ఆగడం లేదు.

చిన్న పిల్లలు బయటకు వెళ్ళాలి అంటేనే భయపడే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. దీనితో తమ పిల్లలను బయటకు పంపాలి అంటేనే భయపడే పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవ౦. అయితే తాజాగా మరో వింత ఘోరం జరిగింది. కర్నూలు జిల్లా అవుకులో దారుణం వెలుగు చూసింది. ఒక బాలుడిపై నలుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

బాలుడ్ని లైంగికంగా వేధిస్తూ వీడియో తీసారు నలుగురు యువకులు. దీనిపై బాలుడి తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. నిందితులను పోలీసులు గుర్తించారు. బుల్లెట్ రాజు, ప్రేమ కుమార్, సునీల్, రాజు గా పోలీసులు గుర్తించారు. నిందితులపై గతంలో రౌడీ షీట్ కూడా ఉంది. నిందితుడు బుల్లెట్ రాజుపై బాంబుల కేసు కూడా ఉంది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version