టికెట్ల పీఎన్‌ఆర్‌ నెంబర్లో మోసాలు.. బలవుతున్న అమాయకులు..!

-

ఈ రోజుల్లో అంతా ఆన్లైన్ లో అవుతోంది. కరోనా వల్ల డైరెక్ట్ కాంటక్ట డేంజర్ ఎందుకని అందరూ ఆన్లైన్ పేమెంట్స్ మొగ్గుచూపుతున్నారు. రైళ్లలో ప్రయాణాలు చేసేవారు కూడా టికెట్ బుకింగ్ ఆన్ లైన్ లో చేస్తున్నారు. అయితే కొందరు మోసగాళ్లు ఈ అవకాశం బాగా వాడేస్తున్నారు.. అమాయకులతో ఆడుకుంటున్నారు. ఎలా అంటారా..బుక్ చేసుకున్న టికెట్ల పీఎన్‌ఆర్‌ను మోసగాళ్లు అక్రమంగా సేకరించి, ప్రయాణికుల పేరు మార్చి వాటిని అమాయకులకు అమ్ముతున్నారు. నకిలీ టికెట్లతో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతోందని సెంట్రల్ రైల్వే అధికారులు అంటున్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు నకిలీ టికెట్లతో రైళ్లలో ప్రయాణిస్తున్న 428 మందిని గుర్తించామని వారు పేర్కొన్నారు.

trains

స్లీపర్ ఏ కాదు.. ఏకంగా 102మంది ఏసీ బెర్తుల్లో వెళ్తున్నవారు కూడా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. బుకింగ్ కౌంటర్ల వద్ద కొనుక్కున్న టికెట్లకు నకిలీ టికెట్లను మోసగాళ్లు తయారు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన డేటాను అక్రమంగా సేకరించి… దీంతో ఒకే బెర్తులో ఇద్దరు ప్రయాణికులకు టికెట్లు వస్తున్నాయి. కరోనా అనంతరం రైళ్లలో ప్రయాణాలు చేసేవారు ట్రయిన్ టికెట్లను బుక్ చేసుకోవాల్సి వస్తోంది. బుకింగ్ చార్టుల్లో తమ పేర్లు లేవని గుర్తించినప్పుడు ప్రయాణికులు రైల్వేను నిందిస్తున్నారు.
టికెట్ చెకింగ్ చేసేవారికి కూడా ఇది ఒక సవాలుగా మారింది. ఒకే బెర్తు టికెట్లు పొందిన ప్రయాణికుల గొడవలను సముదాయిస్తూ, అసలైన వినియోగదారులను టీటీలు గుర్తించాల్సి వస్తోంది.

సీనియర్ సిటిజన్లకు కేటాయించే టికెట్ల విభాగంలో కూడా జూన్ నుంచి వందకు పైగా మోసాలు జరిగినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. దీంట్లో కూడా మోసగాళ్లు ఒరిజినల్ టికెట్ల మాదిరిగా ఉండే టికెట్లను ప్రింట్ చేసి, ప్రయాణికుల పేరు, వయసును మార్చి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.మోసగాళ్లు ముందు సీనియర్ సిటిజన్ల పేరుతో టికెట్లు బుక్ చేస్తారు. వాటిని స్కాన్ చేసి పేరు, వయసు వంటివి మారుస్తారు. కరెక్షన్ సాఫ్ట్‌వేర్ వాడుతూ ఎలాంటి అనుమానాలు రాకుండా ఈ మోసాలకు పాల్పడతారు. ఆ తరువాత వాటిని ప్రింట్ చేసి ఏజెంట్లమని చెప్పుకుంటూ అమాయకులకు అమ్ముతారు.

టికెట్ మోసాలకు సంబంధించి షేక్ అహ్మద్ అనే వ్యక్తిని ఇంటెలిజెన్స్ అధికారులు ఇటీవల పట్టుకున్నారు. అసలు టికెట్ ధరకంటే రూ.200 ఎక్కువకు వీటిని అమ్ముతున్నట్లు అహ్మద్ పోలీసులకు చెప్పాడు. నవంబర్ 18న మహానగరి ఎక్స్‌ప్రెస్‌లో వారణిసికి వెళ్లే సమయంలో అతడు పట్టుబడ్డాడు. సొంతూర్లకు వెళ్లాలనే ప్రయాణికుల అవసరాలతోనే వీరు ఈ విధంగా మోసాలు చేస్తున్నారు. అయితే మోసపోవద్దని జాగ్రత్తగా వ్యవహరించాలని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నకిలీ దందాకు పాల్పడుతున్న వారిని త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version