ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వికలాంగులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ వాహనాలను వికలాంగులకు ఉచితంగానే ఇచ్చేందుకు సిద్దమైందని సమాచారం. ఆన్ లైన్ ద్వారా ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
70 శాతం పైగా వైకల్యం కలిగిన 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులు. కనీసం పదో తరగతి పాసై ఉండాలని… రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలని, అధికారులు తెలిపారు. సొంత వాహనం ఉన్న వాళ్లు అనర్హులు. లబ్దిదారుల ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. గతంలో ఇలాంటి వాహనాలు తీసుకుని ఉండకూడదట. ఇలా చాలా రూల్స్ అమలు చేస్తూ.. వికలాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్.