ఏపీ పేద విద్యార్థులకు శుభవార్త. విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తోంది. ఈనెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు సీటు కావాల్సిన స్కూల్లో దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఏప్రిల్ 19 నుంచి 25 వరకు మొదటి రౌండులో ఎంపికైన వారికి ప్రవేశాలు ఇవ్వనుంది. రెండో విడత ఎంపికైన వారికి మే 1 నుంచి 5 వరకు తల్లిదండ్రులకు సమాచారం అందించనుంది.
ఇది ఇలా ఉండగా.. రూ.1,760 కోట్ల అప్పు తీసుకునేందుకు సిద్ధమైంది ఏపీ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం RBI నుంచి రూ. 1,760 కోట్ల అప్పు తీసుకొస్తుంది. ఈ నెల 21న నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొంటున్నట్లు RBI కి రాష్ట్ర ఆర్థికశాఖ సమాచారం పంపింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో RBI నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఆఖరు అప్పు ఇదే. సెక్యూరిటీల వేలం ద్వారా ఇప్పటివరకు రూ.55, 71 8 కోట్లు అప్పు తెచ్చారు. 21న తీసుకొచ్చే రూ. 1,760 కోట్ల కొత్త అప్పుతో ఈ మొత్తం రూ. 57, 478కోట్లకు పెరుగుతుంది.