కేంద్రం వారికి గుడ్ న్యూస్.. రూ. 2 లక్షల వరకు ఉచిత బీమా.. పూర్తి వివరాలివే..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ ద్వారా చక్కటి లాభాలను పొందొచ్చు. అయితే మోడీ సర్కార్ బీమా ప్రయోజనాన్ని కూడా ఇస్తోంది. ఈ పథకం కింద మీరు రెండు లక్షల రూపాయల వరకు బీమా ప్రయోజనాన్ని పొందడానికి అవుతుంది. పూర్తి వివరాలను చూస్తే.. మన దేశంలో చాలా మంది అసంఘటిత రంగ కార్మికులున్నారు.

వాళ్ళ కోసమే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కేంద్రం తీసుకొచ్చింది. అసంఘటిత రంగంలోని కార్మికులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కల్పిస్తోంది ప్రభుత్వం. ఈ-శ్రమ పథకాన్ని కూడా వాళ్ళ కోసం తీసుకొచ్చారు. ఇ-శ్రమ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కార్డుని పొందొచ్చు. కార్మికులకు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ద్వారా రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా ఇస్తున్నారు.

ఇక ఎలా నమోదు చేసుకోవాలన్నది చూస్తే…

దీని కోసం ముందు ఇ-శ్రమ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్ కు వెళ్ళాలి.
తరవాత ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఆధార్ కార్డ్‌తో లింక్ చేసిన మొబైల్ నెంబర్ ఎంటర్ చెయ్యండి.
మీరు క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి ఓటీపీ పైన నొక్కండి.
ఓటీపీని ఎంటర్‌ చేయాలి.
డాక్యుమెంట్స్ ని అప్‌లోడ్ చేయాలి.
ఫైనల్ గా సబ్మిట్ చేసేయండి అంతే.

Read more RELATED
Recommended to you

Latest news