టిటిడి ఆధ్వర్యంలో వారికి ఉచిత గుండె ఆపరేషన్లు..!

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు టిటిడి తిరుమల అభివృద్ధికే కాకుండా సేవా కార్యక్రమాల పైనా ప్రత్యేక దృష్టి పెడుతోంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి వేదికగా శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని టిటిడి అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా పుట్టుకతోనే గుండె సమస్యలు ఉన్న చిన్నారులకు ఉచితంగా చికిత్సలు అందించనున్నారు. అక్టోబర్ 11న ముఖ్యమంత్రి జగన్ ఈ ఆస్పత్రిని ప్రారంభించనున్నారు.

అంతేకాకుండా అక్టోబర్ 12 నుండి ప్రతి రోజు ఈ ఆస్పత్రిలో ఓపీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఆస్పత్రి సేవలను భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తామని టీటీడీ ప్రకటించింది. ఇదిలా ఉంటే ప్రశంసలు టిటిడి తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రశంసలు అందుతున్నాయి. ఈ నిర్ణయం ద్వారా టిటిడి గుండె సమస్యలతో బాధ పడుతున్న చిన్నారులకు అండగా ఉంటుందని దాంతో పేద మధ్యతరగతి చిన్నారుల ప్రాణాలను కాపాడుతుంది అని ప్రశంసలు అందుతున్నాయి.