ఒక్క రోజులోనే 78 వేల కోరోనా కేసులు

-

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. నిన్న ఒక్క రోజులోనే దేశ‌వ్యాప్తంగా 78,524 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో నిర్ధారణ అయిన మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య‌ 68 లక్షలు దాట‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గురువారం నాటికి 58,27,704 మంది కొవిడ్‌ బాధితులు ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో కొవిడ్ రికవరీ రేటు 85.25%గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌ తెలిపింది.

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 68,35,655 కాగా, 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 971 మంది చనిపోయారు. దీంతో మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 1,05,526కు చేరుకుంది. మృతుల రేటు 1.54%నికి పడిపోయిన‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది. అదేవిధంగా, యాక్టివ్‌ కేసులు 9,02,425కు చేరుకున్నట్లు ప్ర‌క‌టించింది. దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య ఆగస్టు 7వ తేదీ నాటికి 20 లక్షల మార్కు, ఆగస్టు 23 నాటికి 30 లక్షలు, సెప్టెంబర్‌ 5కి 40 లక్షలు, సెప్టెంబర్‌ 16న 50 లక్షలు, సెప్టెంబర్‌ 29వ తేదీ నాటికి 60 లక్షల మార్కు దాటాయి. దేశంలో ఇప్పటి వరకు 8,34,65,975 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news