హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి ఓఆర్ఆర్ మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో స్పాట్ లోనే ఇద్దరు మృతి చెందారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నగర శివారులోని నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ తెల్లవారుజామున రెండు కార్లు ఢీ కొనడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా ఆరు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళుతున్న సమయంలో నార్సింగి ఫ్లైఓవర్ కింద ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఓఆర్ఆర్ ట్రాఫిక్ పోలీసులు. గాయ పడిన వారిని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. హయత్ నగర్ వద్ద యువకులు మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా సూర్యాపేటకు చెందిన వారని నార్సింగి పోలీసులు గుర్తించారు. అయితే ఎవరైతే మద్యం సేవించారో వారిద్దరు మాత్రమే మరణించడం గమనార్హం.