స్టార్ నటి నయనతారకు తమిళనాడు హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. డాక్యుమెంటరీలో చంద్రముఖి మూవీ క్లిప్స్ ను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినీ నిర్మాతలు కోర్టులో నయనతారపై పిటిషన్ వేశారు. అంతకుముందు “నేను రౌడీనే” క్లిప్ వాడటంపై ఆ సినిమా నిర్మాత సైతం కోర్టును ఆశ్రయించారు. వీటిపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు సినిమా క్లిప్ వాడటంపై అక్టోబర్ 6 లోపు సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. నయనతార నెట్ ఫ్లిక్స్ కు కోర్ట్ నోటీసులు ఇచ్చింది.

ఈ విషయం పైన నయనతార ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. కాగా, ప్రస్తుతం నయనతార తమిళ్, మలయాళం, తెలుగులో నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నయనతార నటిస్తోంది. ఇందులో చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.