బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ అనేక రకాల ప్రచారాలు కొనసాగాయి. ఈ విషయం పైన సబితా కుమారుడు, బీఆర్ఎస్ నేత కార్తీక్ క్లారిటీ ఇచ్చారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.

ఇంత కాలం ఇలాంటి తప్పుడు ప్రచారాలను మేము ఎప్పుడు పట్టించుకోలేదని చెప్పారు. కానీ ఇకపై ఊరుకునేది లేదని కార్తీక్ చెప్పారు. తప్పుడు వార్తలను ప్రచురించే వారికి లీగల్ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. నోటీసులు ఇచ్చినట్లయితే ఆ ఛానల్ వారు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇకనుంచి అయినా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండని అన్నారు.