ప్రజలు రోడ్ల మీదకు రాని సమయంలో అడవి జంతువులు ఎక్కువగా బయటకు వస్తున్నాయి. అటవీ శాఖ అధికారులకు కూడా ముప్పతిప్పలు పెడుతున్నాయి. ముఖ్యంగా తిరుమలలో అడవి జంతువుల సందడి ఎక్కువగా ఉంది. తాజాగా తిరుమల… టీబిసీ ప్రాంతంలో కొండ చిలువ హల్ చల్ చేసింది. భారీ చెట్టు పైకి ఎక్కిన కొండ చిలువ కాసేపు కంగారు పెట్టింది.
కొండ చిలువ చెట్టు కొమ్మకు చుట్టుకొని ఉండడాన్ని గమనించి… పరుగులు తీసిన భక్తులు వెంటనే అధికారులకు సమాచారం అందచేసారు . భక్తులు ఇచ్చిన సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకొని క్రేన్ సహాయంతో కొండ చిలువను పట్టిన అటవీ సిబ్బంది… కొండ చిలువను దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలివేసారు. ఈ ఘటన అక్కడ కాసేపు కలవరపెట్టింది. అటవీ శాఖ వేగంగా స్పందించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.