సాధారణంగా మనం బయట తిరుగుతూ ఉన్నప్పుడు వాతావరణ కాలుష్యం వల్ల జుట్టు సమస్యలు అధికంగా ఉంటాయి. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమస్యలు సర్వసాధారణమే. కానీ లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉన్నా కూడా జుట్టు సమస్యలు అధికంగా ఉన్నాయి. మరి ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే ఉల్లి తో ఇలా ట్రై చేయండి.
జుట్టు సమస్యల నుండి విముక్తి పొందాలంటే ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది. ముందుగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కలను ఒక గుడ్డసహాయంతో గట్టిగా పిండుకోవాలి.
అలా పిండగా వచ్చిన ఉల్లి రసాన్ని జుట్టు కుదుళ్లకు అంటించుకోవాలి. ఒక గంట ఆగి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల అక్కడ ఉన్న యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఉల్లి చుండ్రును తగ్గించడమే కాకుండా జుట్టు రాలడం, జుట్టు చిట్లడం వంటి సమస్యల నుంచి కూడా కాపాడుతూ ఉంటుంది.
అతి చిన్న వయసులోనే కొందరికి జుట్టు తెల్లబడుతుంది దానికి కారణం మెలనిన్ పిగ్మెంట్ లేకపోవడమే. ఇటువంటి సమస్యలకు కూడా ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది.
యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉండే ఉల్లి జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.
జుట్టు సమస్యలకే కాకుండా రక్త ప్రసరణకు కూడా ఉల్లి ఎంతో మేలు చేస్తుంది.
ఈ చిట్కాలను పాటించడం వల్ల మీరు కోరుకున్న అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది అలాగే మీ అందం కూడా రెట్టింపు అవుతుంది..