రోజు రోజుకు కిడ్నీకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. వయస్సు పెరిగే కొద్దీ ఎన్నో అనారోగ్య సమస్యలు రావడం సహజమే, అయితే ఎన్నో కారణాల వలన కిడ్నీ ఆరోగ్యం చిన్న వారిలో కూడా దెబ్బతింటుంది. కిడ్నీ ఫెయిల్ అయ్యే ముందు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గమనించి తగిన జాగ్రత్తలను తీసుకోవడం వలన ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుందో, మూత్రం రంగు మారుతుంది. మూత్రం ఎర్రబడడం లేదా మూత్రం నుండి దుర్వాసన రావడం వంటి లక్షణాలు కిడ్నీ అనారోగ్యానికి సంకేతంగా మారతాయి.
ఎప్పుడైతే కిడ్నీలు పనితీరు దెబ్బతింటుందో, ఫిల్టరేషన్ ప్రక్రియ పై ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో చేతులు, కాళ్లు, ముఖం వంటి భాగాల్లో వాపు ఏర్పడుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ముఖం ఉబ్బినట్టు కనిపించడం వంటి లక్షణాలను ఎదుర్కొంటారు. అలాంటి సందర్భాల్లో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. కిడ్నీలు శరీరానికి అవసరమైన మినరల్స్ ను అందిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుందో, చర్మం పొడిబారుతుంది. కిడ్నీ అనారోగ్యంతో రక్తంలో ద్రవముల స్థాయిలు ఎప్పుడైతే పెరుగుతాయో, రక్తపోటు ఎక్కువ అవుతుంది.
దీంతో మరెన్నో సమస్యలు ఏర్పడతాయి. కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిన్నట్లయితే, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లడం లేదా చాలా సేపు వరకు మూత్రం రాకపోవడం వంటివి కనిపిస్తాయి. సాధారణంగా, కిడ్నీలు శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు తొలగిస్తాయి. ఎప్పుడైతే కిడ్నీ పనితీరు మెరుగ్గా ఉండదో, శరీరంలో టాక్సిన్లు పెరిగిపోతాయి. దీంతో అలసట వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆకలి తగ్గిపోవడం, మలబద్ధకం, బరువు పెరగడం వంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా ఏర్పడతాయి. కిడ్నీ పనితీరు దెబ్బతినడం వలన రాత్రి సమయంలో మూత్రం ఎక్కువగా రావడం, ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విధంగా నిద్రలేమి సమస్యతో బాధపడాల్సి ఉంటుంది.