ఇక నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన స్టార్ట్.. జాయింట్ చెక్ పవర్ ఎవరికంటే..!

-

రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్‌,ఎంపీడీఓ, ఎంపీఓ,ఆర్‌ఐ, డీటీ, ఇంజనీర్లు, ఇతర గెజిటెడ్‌ అధికారులను నియమించారు.10 సంవత్సరాల తర్వాత మళ్లీ గ్రామాల్లో ప్రత్యేక పాలన ప్రారంభమయింది. సమైక్య రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2011 నుంచి 2013 వరకు, 2018లో తెలంగాణ ఏర్పడిన తర్వాత పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి.

 

ఇదివరకు సర్పంచ్‌ల వద్ద ఉన్న చెక్కులు,డిజిటల్ కీలు, ఇతర రికార్డులన్నీ జప్తు చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి ప్రత్యేక అధికారి, కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్‌ను ప్రభుత్వం కల్పించింది. డిజిటల్ కీకి అధీకృత అధికారిగా ప్రత్యేక అధికారి ఉంటారు.

ఇక నుంచి గ్రామ పంచాయతీల్లో వచ్చే నిధులన్నింటికీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యత కల్గి ఉంటారు. సర్పంచులు, ఉప సర్పంచుల నుండి డిజిటల్‌ సంతకాల కీలు, పెన్‌డ్రైవ్‌ల రూపంలో ఉన్నవి పంచాయతీ కార్యదర్శులు స్వాధీనం చేసుకోనున్నారు. శుక్రవారం నుండి విధుల్లో చేరనున్న ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం డిజిటల్‌ సంతకాల కీలను ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news