ఆంధ్రప్రదేశ్ లో రేపు సంపూర్ణ లాక్ డౌన్ నిర్ణయం అమలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయినా సరే జనం ఏదోక కారణం చెప్పి బయటకు రావడం పై ఏపీ సర్కార్ సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. జనాలకు ఎన్ని విధాలుగా చెప్పినా సరే మారడం లేదు. దీనితో ఏపీ సర్కార్ ఇప్పుడు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు నిత్యావసర సరుకుల కోసం అనుమతి ఇచ్చారు.
ఆ తర్వాత కూడా జనాలు బయటకు ఏదోక కారణం తో రావడం తో లాక్ డౌన్ ని పూర్తిగా అమలు చెయ్యాలని భావిస్తున్నారు. రోజు విడిచి రోజు సంపూర్ణ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నారు. అవసరమైన పక్షంలో కూరగాయలు రోజు మార్చి రోజు ఉదయం 6 నుంచి 9 గంటలలోపు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇక చికెన్ షాపులను కూడా రేపు బంద్ చెయ్యాలని భావిస్తున్నారు. ప్రజలు ఎక్కువగా ఒక్క చోటకు రావడం, చేపల మార్కెట్ లో ఎగబడటం పై ఏపీ ప్రభుత్వం చర్యలకు దిగింది.
ఏ విధంగా కూడా క్షమించవద్దని కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని జగన్ స్పష్టం చేస్తున్నారు. ఏపీ డీజీపీ కూడా ఇదే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినట్టు సమాచారం. ఈ లాక్ డౌన్ ని పూర్తిగా అమలు చేయకపోతే కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చర్యల విషయంలో వెనుకాడవద్దని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీ లో కేసులు 380 వరకు ఉన్నాయి ఆరుగురు కరోనా కారణంగా మరణించారు. అందుకే ఇప్పుడు సంపూర్ణ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నారు.