తులసి మొక్కతో మీ కుటుంబ భవిష్యత్తు తెలుసుకోవచ్చు!

-

తులసీ.. సాక్షాత్తు దైవతా వృక్షంగా హిందువులందరూ భావిస్తారు. తులసీ మొక్కలేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాకపోవచ్చు. తులసీ ఆరాధన చేస్తే శ్రీమహావిష్ణువు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంతేకాదు సకల శుభాలు, ఆరోగ్యాన్ని తులసీ ప్రసాదిస్తుంది. అటువంటి పరమ పవిత్రమైన చెట్టు కేవలం దైవ సంబంధమైన పూజకే కాదు మన ఇంట్లో జరగబోయే విషయాలను కూడా చెప్తుందని పండితులు అనుభవం మీద గడించిన విషయాలు తెలియజేస్తున్నారు. ఆ విషయాలు పరిశీలిద్దాం… తులసి మొక్క తన సహజ రంగును కోల్పోవడమో, ఆకులు సడెన్‌గా ఎండిపోవడమో లేదా రాలిపోవడమో జరుగుతుంది. ఈ మార్పులను బట్టి ఇంట్లో వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చట. ఒక రకంగా తులసి చెట్టు మార్పులు మన భవిష్యత్తుకు సంకేతాలట. తులసిలో వచ్చే మార్పులు.. వాటి సూచనలు తెలుసుకుందాం…

తులసీ ఇచ్చే సంకేతాలు:
ఒక వేళ నీళ్లు పోయకున్నాతులసి మొక్క బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే.. ఇంట్లో వారికి అదృష్టం కలసి రాబోతుందని అర్థమట. భవిష్యత్తులో వారికి సంపద బాగా వస్తుందట
తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే.. ఇంట్లో ఆనందం, సంతోషం మనవెంటే ఉంటాయట. ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్థమట.
ఒకవేళ పచ్చగా కళకళలాడుతున్న తులసి చెట్టు ఆకులు సడెన్‌గా ఎండిపోతే.. ఆ ఇంటి యజమానికి ఆరోగ్యం పరంగా కీడు జరగబోతుందని అర్థం. ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుందని అర్థం.
చెట్టు ఆకులు సడెన్‌గా వేరే రంగుకు మారితే.. ఇంట్లో ఉన్నవారు క్షుద్ర శక్తుల బారిన పడనున్నారని అర్థమట. ఎవరైనా గిట్టనివారు క్షుద్ర శక్తులు ప్రయోగించినపుడే తులసి ఆకులు రంగు మారుతాయట.
దీన్నిబట్టి, తులసి మొక్కని భక్తిగా పూజ చేయడమే కాదు.. తలసి మొక్క ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. మొక్కలో మార్పులూ గమనిస్తూ ఉండండి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news