అసెంబ్లీ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక ప్రకటన..!

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి అయితే దీనిలో ఎక్కువగా గత ప్రభుత్వం చేసిన అవినీతి అలానే అక్రమాల పైన ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా కాలేశ్వరం పై రాష్ట్రంలో పెద్ద చర్చి నడుస్తోంది. దీని మీద అధికార ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేయడం జరిగింది. అసెంబ్లీ ఆవరణలో నడుచుకోవాల్సిన తీరు మీద కొత్త రూల్స్ పెట్టారు.

Allotment of rooms to BRS in Telangana Assembly

సమావేశాలు జరుగుతున్న టైంలో అసెంబ్లీ ఇన్సైడ్ చైర్ అనుమతి లేకుండా మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు వీడియో ప్రదర్శన చేయకూడదని అన్నారు. అంతే కాకుండా అసెంబ్లీ నడుస్తుండగా ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడకూడదని బ్రేక్ టైం లేదా సభ వాయిదా తర్వాతే మాట్లాడాలని అన్నారు. నిన్న ఈ విషయం పైనే బిఆర్ఎస్ ఆందోళన చేపట్టారు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాటలు యుద్ధం బాగా జరిగింది కెసిఆర్ రాకపోవడం పై జరిగిన చర్చలు రేవంత్ రెడ్డి తో పాటుగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డారు దీంతో బిఆర్ఎస్ నేతలు వాక్ అవుట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news