గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల మధ్యన యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం వలన ఎంతమంది అమాయకుల జీవితాలు నాశనం అవుతాయన్న చిన్న విచక్షణ లేకుండా రెండు దేశాలు ప్రవర్తించడం ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలను కళ్ళు చేమాడ్చేలా చేస్తున్నాయి. తాజాగా ఒక ఘటన గుండె తరుక్కుపోయేలా చేస్తోంది. ఈ యుద్ధం వలన గాజా నగరంలో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. హామాస్ ఇజ్రాయెల్ మీద చేసిన విచక్షణారహిత దాడుల కారణంగా మంచి నీటి సరఫరా, విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో గాజాలో మంచినీటికి డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ ఒక క్యాన్ మంచినీటిని కొనుగోలు చేయాలంటే అక్షరాలా 50 ఇజ్రాయెలీ షెకెల్స్ (రూ. 1040) కావాల్సి వస్తోంది.
అందుకే ఇక్కడ ప్రజలు చాలా మంది ఉప్పు మరియు మురికి నీరు కలిసి ఉన్న నీటిని తీసుకోవాల్సి వస్తోంది అంటూ గాజా వాసి మహమ్మద్ చాలా బాధాతప్త హృదయంతో ఒక మీడియాకు చెప్పారు.