అసెంబ్లీ బరిలో గేమ్ ఛేంజర్స్!

-

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ నేతలు దూకుడుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే..అడుగడుగున కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎత్తిచూపుతూ…ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ…తమ పార్టీని బలపర్చేందుకు నేతలు గట్టిగా కష్టపడుతున్నారు. అయితే బీజేపీలో చాలామంది స్ట్రాంగ్ నేతలు ఉన్నారు..వారు తమదైన శైలిలో రాజకీయం చేస్తూ…టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.

రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ ఎలాగో తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడుగా ముందుకెళుతున్నారు. బండికి తోడుగా పలువురు సీనియర్లు ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు. కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, కె లక్ష్మణ్, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, రఘునందన్, రాజాసింగ్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీలో పలువురు గేమ్ ఛేంజర్స్ ఉన్నారని చెప్పొచ్చు.

వీరంతా నెక్స్ట్ కేసీఆర్ ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. అయితే నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి రావాలంటే ఈ గేమ్ ఛేంజర్లు తప్పనిసరిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాల్సిన పరిస్తితి ఉంది. ఎక్కడకక్కడ బలమైన నేతలు ఉంటేనే కమలం పార్టీ అధికారానికి దగ్గర అవుతుంది. పైగా పార్లమెంట్ ఎన్నికలు తర్వాత జరుగుతాయి కాబట్టి….ముందు అసెంబ్లీ బరిలో అందరూ దిగేయాలని చూస్తున్నారు.

ఇక ఈ నేతలంతా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈటల…గజ్వేల్ లో పోటీ చేసి కేసీఆర్ కు చెక్ పెడతానని అంటున్నారు. అదే సమయంలో తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో తన భార్య జమునా రెడ్డిని బరిలో దింపుతారని తెలుస్తోంది. అటు రాజాసింగ్..గోషా మహల్ లో, రఘునందన్…దుబ్బాకలో పోటీ చేయడం ఖాయం.

అలాగే కిషన్ రెడ్డి..అంబర్ పేటలో, బండి సంజయ్..వేములవాడ లేదా కరీంనగర్ లో, డీకే అరుణ…గద్వాల్ లో, జితేందర్ రెడ్డి…మహబూబ్ నగర్ లో, అరవింద్…ఆర్మూర్ లో, కొండా విశ్వేశ్వర్ రెడ్డి…తాండూరు లేదా మహేశ్వరంలో, వివేక్…చెన్నూరులో, సోయం బాపురావు…బోథ్ లో, విజయశాంతి…మెదక్ అసెంబ్లీ లేదా హైదరాబాద్ లో ఏదొక నియోజకవర్గం. ఇలా కమలంలో ఉన్న బలమైన నాయకులు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version