కత్రినా తన భర్తని చంపేస్తామంటూ.. బెదిరిస్తోంది ఎవరంటే..?

-

ఏ ఇండస్ట్రీలో నైనా నటీనటులపై బెదిరింపులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పైన, అతని తండ్రి పైన బెదిరింపు ఒకటి వైరల్ గా మారింది. ఆ వెంటనే సల్మాన్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.. ఇక దీంతో ఆ విషయం కాస్త సైలెంట్ అవ్వడం జరగకముందే ఇప్పుడు మరొకసారి బెదిరింపు వ్యవహారం బాలీవుడ్ లో కలకలం రేపిస్తోంది.

స్టార్ కపుల్స్ గా పేరు పొందిన విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ లను చంపేస్తామంటూ సోషల్ మీడియాలో, ఇంస్టాగ్రామ్ ద్వారా బెదిరింపులు చేశారట. ఇక అంతే కాకుండా ఇద్దరినీ జంటగా చంపేస్తామంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి వీరిని బెదిరించారట. దీంతో అలర్ట్ అయిన ఈ జంట ముంబైలో శాంతా క్రూజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అంతేకాకుండా ఈ జంటకు ప్రత్యేకమైన పోలీస్ సిబ్బంది ని నియమించారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నటుల పైన ఇలాంటి బెదిరింపు రావడం ఇది రెండవసారి.

ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బృందంతో ముంబైలో ఉండే మాఫియా గ్యాంగ్ స్టార్ల పైన కూడా నిఘా ఉంచి వారి పైన ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఇక గడిచిన కొన్ని నెలల క్రితం పంజాబ్ సింగర్ సిద్దు హత్య కేసులో గ్యాంగ్స్టర్ లారెన్స్ బీస్టోమ్ ప్రధాన నిందితుడుగా దొరికారు.. అయితే ఇటీవల విచారణ జరిపించగా సల్మాన్ ఖాన్ ని బెదిరించింది కూడా అతడే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాలీవుడ్ అంతా ఒకసారిగా షాక్ అయింది. ఇక కత్రినా విక్కీ లను బెదిరించడంతో ఇప్పుడు మరింత భయపడుతున్నారు బాలీవుడ్ నటీనటులు. అయితే ఇలాంటి బెదిరింపులు గతంలో కూడా అమీర్ ఖాన్ , షారుఖ్ ఖాన్ ఇతర నటీనటులు సైతం ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం విక్కీ కౌశల్ బెదిరింపు మాత్రం చాలా సీరియస్ గా ఉండడంతో పోలీసులు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version