బ్రేకింగ్ : మళ్ళీ విధులు బహిష్కరించిన గాంధీ ఆసుపత్రి సిబ్బంది..

-

విధులు బహిష్కరించి మళ్ళీ ఆందోళనకు దిగారు గాంధీ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది. జీతాలు పెంచినట్లు చెప్పిన ప్రభుత్వం మూడు నెలలు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. పెంచిన జీతాలు, కరోన స్పెషల్ అలవెన్స్ ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఆవరణలోనే పెషంట్ కేర్, ఔట్ సోర్సింగ్, సెక్యూరిటీ, పారిశుద్ధ్య కార్మికులు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కూడా గాంధీ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులను బహిష్కరించి రోడ్డు పైనే బైఠాయించారు. ఔట్ సోర్సింగ్ నర్సుల బాటలోనే గాంధీ ఆస్పత్రి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది అప్పుడు ఆందోళనకు దిగారు. ఏకంగా అప్పుడు ఐదు ఆరు రోజుల పాటు విధులను బహిష్కరించి సమ్మె చేశారు ఔట్ సోర్సింగ్ నర్సులు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రోగులు, వైద్యులకు అవస్థలు తప్పవని భావించి అప్పటికప్పుడు స్పందించి వారి డిమాండ్స్ కి తలొగ్గింది. అయితే ఆ హామీలు ఇచ్చి మూడు నెలలు కావోస్తుండడం, ఇంకా వాటి అమలుకు నోచుకోక పోవడంతో మళ్ళీ వారు ఆందోళనకు దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news