సిడ్నీలో ‘మహాత్ముడు’

-

జాతి పిత మహాత్మగాంధీ కాంస్య విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గురువారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఆవిష్కరించారు. మహాత్ముడి 150 వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని  ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరీసన్‌తో కలిసి రాష్ట్రపతి దంపతులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ… భారత్ లో  భిన్నత్వంలో ఏకత్వాం ఉండటానికి గాంధీ చూపిన మార్గమే ఆదర్శంగా నిలిచిందన్నారు. భారత్‌లోలాగే భిన్న సంస్కృతులు, కులమతాలు ఉన్న ఆస్ట్రేలియాలాంటి సమాజాలను గాంధీ ఎప్పుడూ ప్రోత్సహించేవాడని ఆయన పేర్కొన్నారు.

అహింస, శాంతి, సత్యమేవ జయతే వంటి సందేశాలను ప్రపంచం నలుమూలలా ప్రాచుర్యం పొందాయన్నారు. విగ్రహ ఆవిష్కరణ సమయంలో ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ‘‘భారత్ మాతా  కీ జై’’, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. అహింస, శాంతి స్థాపనకు గాంధీ మహాత్ముడు అనుసరించిన విధానాలు ప్రపంచ వ్యాప్తంగా కీర్తించబడ్డాయని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరీసన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news