ఏపీ ప్రజలకు జీవ నాడిగా పేర్కొంటూ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను సత్వరం ఆపివేయించాలంటూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంలో పిటీషన్ వేసింది. ఈ ప్రాజెక్టు వల్ల ఒడిశాకు తీరని నష్టం జరగనుంది… కాబట్టి వెంటనే పనులు ఆపాలని మధ్యంతర ఉత్తర్వూలు జారీ చేయాలని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. పిటీషన్ను పరిశీలించిన సుప్రీం ఈ నెల 27న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
2019 లక్ష్యంగా నీటి విడుదల చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనుల్లో జోరు పెంచింది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నాటికి ప్రాజెక్టును సిద్ధం చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. దీంతోపాటు ఇతర ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే ప్రతి సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనులను సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యం ప్రాధాన్యం సంతరించుకుంది.