అదే నిజమైతే గ్యాంగ్ లీడర్ హీరోయిన్ కి మంచి ఛాన్స్ దొరికినట్టే..

నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమా బాక్సాఫీసు వద్ద ఓ మోస్తారుగా ఆడింది. ఐతే అందులో హీరోయిన్ గా నటించిన ప్రియాంకా ఆరుళ్ మోహన్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న శ్రీకారం సినిమాలో నటిస్తుంది. ఈ ఒక్క సినిమా తప్ప ఆమె చేతిలో వేరే సినిమా ఉన్నట్టు వినిపించలేదు. తాజా సమాచారం ప్రకారం గ్యాంగ్ లీడర్ భామకి మరో మంచి అవకాశం వచ్చిందని సమాచారం.

నితిన్ హీరోగా నటిస్తున్న చెక్ సినిమాలో ప్రియాంక పేరుని పరిశీలిస్తున్నారట. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చెక్ సినిమా కోసం ప్రియాంకా అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. కథ పరంగా హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉండడంతో ప్రియాంకా సరిగ్గా సరిపోతుందని అనుకుంటున్నారట. మరి ఇది నిజమై ప్రియాంకకి చెక్ సినిమాలో అవకాశం వస్తే కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది. మరేం జరుగుతుందో చూడాలి.