స్నేహితుడి కూతురుపైన గ్యాంగ్ రేప్… మధ్యప్రదేశ్ లో దారుణం…

రోజుకు ఎక్కడో చోట అత్యాచారాలు నమోదవుతూనే ఉన్నాయి. చాలా కేసుల్లో తెలిసిన వారు, సన్నిహితంగా ఉండే వారే అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. నమ్మిస్తూనే రేప్ చేస్తున్నారు. దీంట్లో బాధితులుగా చిన్నారులు ఉంటున్నారు. మరోసారి ఇలాంటి అమానవీయమైన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. నమ్మిన స్నేహితులే నయవంచన చేశారు. స్నేహితుడి కూతురును సొంత కూతురులాగా చూడాల్సిన వారే చిదిమేశారు. అభం శుభం తెలియని 11 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

child rape cases

మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ లో స్నేహితుడి కుమార్తెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. 7వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై 25,25 ఏళ్ల వయస్సున్న ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. పెరట్లో గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. డిసెంబర్ 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంలో నిందితులిద్దరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 11న బాలికపై చేస్తున్న రేప్ ను చూసిన పక్కింటి మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి నిందితులిద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.  నిందితులిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులిద్దరిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు.