ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ మరణాలు పెరుగుతున్నాయి. దీంతో పలు దేశాల ప్రభుత్వాలు కలవరపడుతున్నాయి. ముఖ్యంగా డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉందిని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య 10 వేలను దాటింది. ముఖ్యంగా యూకే, డెన్మార్క్ దేశాల్లో ఓమిక్రాన్ కల్లోలం కొనసాగుతోంది. ఇటీవల ఓమిక్రాన్ వల్ల యూకేలో తొలి మరణం నమోదైంది.
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ మరణాలు పెరుగుతాయని WHO హెచ్చిరించింది. రానున్న కాలంలో కేసులు పెరిగే కొద్ది ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుందని అంచానా వేస్తోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల వివరాలను అందించాలని ప్రపంచ దేశాలను WHO కోరింది. ఇదిలా ఉంటే యూకేలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ వచ్చే ఎప్రిల్ నాటికి 25 వేల నుంచి 75 వేల వరకు మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.