దేశంలో ఓమిక్రాన్ కల్లోలం… ఒక్కరోజే 16 కేసులు నమోదు…

-

దేశంలో ఓమిక్రాన్ కల్లోలం మొదలైన పరిస్థితి కనిపిస్తోంది. రోజూ పది సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో 16 కొత్త ఓమిక్రాన్ కేసులు ఒకే రోజులో నమోదయ్యాయి. వీటిలో మహారాష్ట్రలో 8, రాజస్థాన్ లో 4, ఢిల్లీలో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 57కు చేరింది. ఇటీవల కొన్ని రోజుల నుంచి క్రమంగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రస్తుతం మహారాష్ట్రలో మొత్తం 28 కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. తర్వాతి స్థానంలో రాజస్థాన్ 13 ఓమిక్రాన్ కేసులు నమోదు కాగా… ఢిల్లీలో 6, కర్ణాటకలో 3, గుజరాత్ లో 4, కేరళలో 1, ఏపీలో 1, ఛండీగడ్ లో1 చొప్పున ఓమిక్రాన్ కేసులు నమోదయ్యయాయి. కాగా జినోమ్ సీక్వెన్సింగ్ పంపించిన శాంపిళ్ల మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. ఇవి వస్తే కొత్త కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఓమిక్రాన్ వచ్చిన వారిలో ఎక్కువ మంది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, టాంజానియా, ఐర్లాండ్ దేశాల నుంచి వచ్చిన వారే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news