ఏపీలో ప‌దోత‌ర‌గతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..!

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జ‌రింగింది. మ‌చిలీప‌ట్నం కృత్తివెన్ను మండలం చినపాండ్రాక గ్రామానికి చెందిన బాలికపై దుర్మార్గులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. బాధిత విద్యార్థిని మచిలీపట్నంలోని ఓ పాఠ‌శాల‌లో పదో తరగతి చదువుతుంది. మ‌హేష్ అనే యువ‌కుడు బాలికకు మాయ మాట‌లు చెప్పి గొడ్ల సావిడికి తీసుకెళ్లాడు. అనంత‌రం మరో ఇద్దరు యువకులు అంతబాబు, తరుణ్ అలియాస్ ముని, మహేష్ బాలిక‌పై అత్యాచారం చేశారు.

child rape cases
child rape cases

బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేస‌కున్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 376 రెడ్ విత్ 34, పోక్సొ చట్టం సెక్షన్ 5(a) రెడ్ విత్ 6 క్రింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండ‌గా గ‌త కొంత‌కాలంగా మ‌హిళ‌ల‌పై ఏపీలో దారుణాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ట్టాల‌ను అమ‌లు చేస్తున్నా..నింధితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తున్నా నింధితుల్లో మార్పు రావ‌డం లేదు.