దొర ఎందుకో పొర్లు దండాలు పెడుతుండు..కేసీఆర్ పై ష‌ర్మిల‌..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి మండి ప‌డ్డారు. ఏడెళ్ళలో అంబేడ్కర్ విగ్రహానికి కేసీఆర్ ఎప్పుడూ దండ కూడా వేయలేదని ఆరోపించారు. దొర ఇప్పుడు ఎందుకో పోర్లు దండాలు పెడుతున్నాడంటూ ష‌ర్మిల వ్యాఖ్యానించారు. సీఎంఓ లో ఇప్పుడు దళిత ఆఫీసర్స్ ను నెత్తిన పెట్టుకుంటున్నాడంటూ ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ నిధులను సగం కూడా ఖర్చు చేయని కేసీఆర్….దళిత ఓట్ల కోసం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధం అయ్యాడంటూ ష‌ర్మిల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ ప్రేమ అంతా హుజూరాబాద్ ఎన్నికల మహిమే అంటూ ష‌ర్మిల వ్యాఖ్యానించారు.
దళితుల మీద నిజంగా మీకు ఈ ప్రేమ ఉంటే ఈ డ్రామాలు అపండంటూ ష‌ర్మిల కేసీఆర్ కు హిత‌వు ప‌లికారు. ఐదేళ్ల క్రితం అసెంబ్లీ సాక్షిగా కెటిఆర్ హామీ ఇచ్చిన లెదర్ పార్క్ ను వెంటనే ప్రారంభించాలంటూ ష‌ర్మిల డిమాండ్ చేశారు. 20 వేల మంది దళితులకు ఉపాధి కల్పించాల‌ని ష‌ర్మిల డిమాండ్ చేశారు.